చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారు... 1996 మళ్లీ రిపీట్ అవుతుంది: కుమారస్వామి

  • దేవేగౌడ, చంద్రబాబుల మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి
  • దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై చర్చించాం
  • జాతీయ రాజకీయాల్లోకి చంద్రబాబు మళ్లీ ఎంట్రీ ఇచ్చారు
మాజీ ప్రధాని దేవేగౌడ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుల మధ్య ఎంతో కాలంగా రాజకీయ మిత్రత్వం ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఈరోజు జరిగిన సమావేశంలో దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై తాము చర్చించామని తెలిపారు.

జాతీయ రాజకీయాల్లోకి చంద్రబాబు మళ్లీ ఎంట్రీ ఇచ్చారని... 1996లో యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చిందని, 2019 ఎన్నికల్లో కూడా అదే మరోసారి రిపీట్ కాబోతోందని చెప్పారు. మహాకూటమి ఏర్పాటులో భాగంగా దేవేగౌడ, కుమారస్వామిలతో చర్చించేందుకు చంద్రబాబు బెంగళూరుకు వెళ్లిన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం మీడియాతో కుమారస్వామి మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Chandrababu
kumaraswamy
devegowda
bengaluru

More Telugu News